విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ పారిశ్రామిక అవసరాలకు స్థలం సేకరించటానికి ఈనెల 25న ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నారు. ఇందుకు నిరసనగా తెదేపా, సీపీఐ, సీపీఎం పార్టీలు బైక్ ర్యాలీ నిర్వహించాయి. భూనిర్వాసితులకు ముందస్తు పరిహారం చెల్లించాకే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకుడు వెంకటేష్, సీపీఎం నాయకుడు అప్పలరాజు, దాసు పాల్గొన్నారు.
'దాడి కుటుంబం మా స్థలాన్ని ఆక్రమించింది.. చంపేస్తామని బెదిరిస్తోంది'