పెద్ద పరిమాణంలో ఉన్న ముల్లంగి దుంపలను విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ పంచాయతీ.. గొల్లలపాలానికి చెందిన యువ రైతు బొట్ట పాలవెల్లి పండించాడు. యువ రైతు బొట్ట పాలవెల్లికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. తన పొలంలో అందరిలానే.. ముల్లంగి పంట సాగుచేశాడు. అయితే ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టి.. సాగు చేయడంతో మంచి దిగుబడులు వచ్చాయి. సాధారణంగా ముల్లంగి దుంప 100 గ్రాములు నుంచి పావుకేజీ వరకు బరువు ఉంటాయి. యువ రైతు పాలవెల్లి పండించిన ముల్లంగి మాత్రం ఒక కేజీ నుంచి రెండు కేజీల బరువున్న దుంపలు దిగుబడికి వచ్చాయి.
కష్టానికి తగిన ప్రతిఫలంగా.. ముల్లంగి పంట రెండింతలు దిగుబడికి రావడం చాలా ఆనందంగా ఉందని రైతు అంటున్నారు. యువ రైతు పాలవెల్లి పండించిన ముల్లంగి దుంపలను గ్రామానికి చెందిన తోటి రైతులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఇదీ చదవండి: సీఎంగా ఉండటానికి జగన్రెడ్డి అనర్హుడు: చంద్రబాబు