ప్రాణాలకు తెగించి వైద్యులు కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. వారి సేవలకు గుర్తుగా విశాఖ నగరంలోని స్వాతి ప్రమోటర్స్ సంస్థ 14 అడుగుల డాక్టర్ ప్రతిమను రూ.2.50లక్షల వ్యయంతో తయారు చేయించింది. స్థానిక కళాకారులు జీ.వీ.రమణమూర్తి బృందం ప్రతిమను తీర్చిదిద్దారు. దీనిని నగరంలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ బాధ్యులు జీ.వీ.కృష్ణారెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి. ఇంటి వద్దకే ఏటీఎం... తపాలా శాఖ వినూత్న సేవలు