రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రౌడీ రాజ్యాన్ని నడుపుతోందని తెదేపా భీమునిపట్నం నియోజకవర్గ ఇంఛార్జి సబ్బం హరి ఆరోపించారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరం తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ విషయంలో వైకాపా చర్యలపై.. ఎన్నికల రిటర్నింగ్ అధికారిని శోభారాణిని అడిగి తెలుసుకున్నారు. అధికార పార్టీ ప్రజాదరణ పొంది విజయం సాధించాలి తప్ప భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి ముందుకు సాగడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు లేని ప్రభుత్వంగా రాష్ట్ర చరిత్రలో వైకాపా ప్రభుత్వం మిగిలోపోతుందని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్: ఇటలీలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు