ETV Bharat / state

Somu Veeraju On CBI: సీబీఐ రాజ్యాంగ సంస్థ.. కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదు: సోము వీర్రాజు - news parliament news

BJP president Somu Veerraju comments on CBI: ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రస్తావించటం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సీబీఐ పని తీరుపై, ప్రతిపక్షాల వ్యవహార శైలిపై కీలక వ్యాఖ్యలు చేశారు.

BJP president
BJP president
author img

By

Published : May 28, 2023, 7:13 PM IST

BJP president Somu Veerraju comments on CBI: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించడం పట్ల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన.. విశాఖపట్టణం నుంచి ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పని తీరు, నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం, పార్టీల పొత్తులు, తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్, కమ్యూనిస్టుల పార్టీల వ్యవహార శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయి.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం రోజున 'మన్ కీ బాత్‌' పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విశాఖపట్టణం నుంచి హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నూతన పార్లమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతిపక్షాలు హాజరుకాకపోయినా.. మిగిలిన చాలా పార్టీలు హాజరయ్యాయని తెలిపారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం ఒక చారిత్రాత్మక ఘట్టమని వ్యాఖ్యానించిన ఆయన.. ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్త పార్లమెంట్​ భవనం కాదు.. 140 కోట్ల ప్రజల కలల ప్రతిబింబం: ప్రధాని మోదీ

సీబీఐకి-కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు.. మాజీ మంత్రి వివేకానందా రెడ్డి హత్య కేసు సీబీఐ దర్యాప్తుపై సోము వీర్రాజు స్పందించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అనేది రాజ్యాంగ సంస్థని, అటువంటి దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ వెళతాయన్నారు. ప్రస్తుతం ఆ సంస్థల పని తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అయినా, ఆ సంస్థలపై పని తీరుపై కొందరు అస్పష్టంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి- సీబీఐకి ఎటువంటి సంబంధం ఉండదన్న ఆయన.. తెలుగుదేశం పార్టీ పొత్తు విషయం అధిష్ఠానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ, జనసేనలు పొత్తుగానే ముందుకు సాగుతున్నాయని సోము వీర్రాజు వెల్లడించారు.

Tributes to NTR: "మా గుండెలను మరొక్కసారి తాకిపో.." యుగపురుషుడికి ప్రముఖుల నివాళులు

కేసీఆర్, కాంగ్రెస్, కమ్యూనిస్టులది సూడో మనస్తత్వం.. ''కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం దేశ ప్రజలు గర్వించతగ్గ ఒక చారిత్రాత్మక ఘట్టం. కానీ, పార్లమెంట్ విషయంలో ప్రతిపక్షాలు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, కాంగ్రెస్, కమ్యూనిస్టులది ద్వంద్వ వైఖరి. వారిది సూడో మనస్తత్వం. బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధాని పార్లమెంట్ భవనాన్ని ప్రారంభిస్తే.. వ్యతిరేకిస్తారా..?. కమ్యూనిస్టులు కార్పొరేట్ శక్తులు. చైనా, రష్యాలకు గొడుగులు పడుతున్నారు. రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రధాని మన్ కీ బాత్‌లో ప్రస్తావించటం.. తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. తెలుగంటే అర్ధంలేని పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నిర్మాణమవుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రధాని తెలుగు ప్రైడ్‌ని తట్టిలేపారు.'' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

వైఎస్సార్సీపీపై బైరెడ్డి శబరి ఆగ్రహం.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 9 సంవత్సరాల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని.. భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి శబరి అన్నారు. బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కర్నూలు నగరంలోని బైరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. బీజేపీ తొమ్మిది సంవత్సరాల పాలనలో దేశంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం టిడ్కో గృహాలను నిర్మిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడం లేదని బైరెడ్డి శబరి మండిపడ్డారు. కర్నూలులో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను స్థాపించిందని పేర్కొన్నారు.

Pawan on New Parliament Building: భరతమాత మెడలో మరో మణిహారం సెంట్రల్ విస్టా : పవన్ కళ్యాణ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.