ETV Bharat / state

బెంగళూరులో విశాఖ మత్తు - బెంగుళూరు డ్రగ్స్​ కేసుతో విశాఖకు సంబంధం

బెంగళూరులో సంచలనం సృష్టిస్తోన్న గంజాయి కేసు తాజాగా విశాఖకు పాకింది. గంజాయిని విశాఖ నుంచే తీసుకెళ్తున్నామని డ్రగ్ ముఠా చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. విశాఖలో ఎవరి వద్ద ఆ మత్తు పదార్థాలను కొనుగోలు చేశారనేది మాత్రం ఇంకా తేలలేదు. ఇదొక్కటే కాదు... కొన్నాళ్లుగా బెంగళూరులో పట్టుబడుతున్న పలువురు మాదకద్రవ్యాల సరఫరాదారులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విశాఖతో సంబంధాలు ఉంటున్నాయి.

drugs
బెంగళూరులో విశాఖ మత్తు
author img

By

Published : Apr 6, 2021, 7:13 AM IST

బెంగళూరులో తాజాగా సంచలనం సృష్టిస్తున్న మత్తుమందుల కేసులో పట్టుబడిన నిందితులు... వాటిని తాము విశాఖపట్నం నుంచి తీసుకొస్తున్నట్లు అక్కడి పోలీసులకు చెప్పడం చర్చనీయమైంది. కడుగొండనహళ్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఫిబ్రవరి 27, మార్చి 5వ తేదీల్లో పట్టుబడిన ఈ ముఠాల సభ్యులు... తరచూ విశాఖపట్నం వస్తూ అక్కడే మత్తుపదార్థాలను కొనుగోలు చేస్తూ.. వాటిని బెంగళూరులోని విద్యార్థులకు సరఫరా చేస్తుంటారని విచారణలో తేలింది. పోలీసులకు పట్టుబడిన వారిలో ముగ్గురు ఆఫ్రికా దేశాలకు చెందిన వారున్నారు. వారిలో ఇద్దరు నైజీరియా వాసులు కావడం గమనార్హం. విశాఖలో ఎవరి వద్ద ఆ మత్తు పదార్థాలను కొనుగోలు చేశారనేది మాత్రం ఇంకా తేలలేదు. ఇదొక్కటే కాదు... కొన్నాళ్లుగా బెంగళూరులో పట్టుబడుతున్న పలువురు మాదకద్రవ్యాల సరఫరాదారులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విశాఖతో సంబంధాలు ఉంటున్నాయి. గతేడాది మార్చి 6న అక్కడి సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు.. కేఆర్‌పురం పోలీసుస్టేషన్‌ పరిధిలో 70 ఎల్‌ఎస్‌డీ స్ట్రిప్పులు, ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు పట్టుబడిన నలుగురు నిందితుల్ని ప్రశ్నించగా.. వాటిని విశాఖపట్నం నుంచి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.

మూలాల్లోకి వెళ్లి ఆరా ఏదీ?
* విశాఖ నగరంలోనూ ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ గుళికలు, కొకైన్‌ తదితర మత్తు పదార్థాలు పట్టుబడిన సందర్భాలు గతంలో అనేకం వెలుగుచూశాయి. ఆయా కేసుల్లో పోలీసులు సరఫరాదారుల్ని అరెస్టు చేయగలుగుతున్నారు. వాటి మూలాల్లోకి వెళ్లి లోతుగా పరిశోధన చేయడంలో మాత్రం సఫలం కాలేకపోతున్నారు.
* వాటిని సమకూరుస్తున్న నెట్‌వర్క్‌ను ఛేదించలేకపోతున్నారు. నగరంలో సబ్‌డీలర్లుగా వ్యవహరిస్తున్న వారిని గుర్తించలేకపోతున్నారు.
* బెంగళూరు పోలీసులు తాజాగా పట్టుకున్న ముగ్గురు నిందితుల నుంచి ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అందులోని సమాచారాన్ని విశ్లేషించారు. విశాఖ పోలీసులు ఆ సమాచారాన్ని తెప్పించుకుని ముందుకు సాగితే స్థానిక నెట్‌వర్క్‌ను ఛేదించే వీలుంటుంది.

ఎక్కడి నుంచి? ఎలా?
* విశాఖ మన్యంలో అక్రమంగా సాగవుతున్న గంజాయికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారీ డిమాండు ఉంది. దీంతో మత్తు ముఠాలు కొన్నేళ్లుగా ఇక్కడ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తొలుత కొందరు స్థానిక యువకులకు దాన్ని అలవాటు చేసి... క్రమంగా వారినే రవాణాదారులుగా మార్చేశాయి.
* విశాఖ నుంచి గంజాయిని గోవా తదితర ప్రాంతాలకు పంపించి... అందుకుప్రతిగా అక్కడి నుంచి నగదు కాకుండా ఎల్‌ఎస్‌డీ వంటివి తీసుకొస్తున్నారు. విశాఖలో కిలో గంజాయి రూ.5 వేలు ఉంటే.. గోవాలో రూ.35 వేలు ఉంటుందని అంచనా. అదేసమయంలో గోవాలో రూ.500కు లభించే ఎల్‌ఎస్‌డీ బ్లాటు.. విశాఖలో రూ.2 వేలు వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
* గోవా నుంచి తెస్తున్న ఎల్‌ఎస్‌డీ, కొకైన్‌, ఎక్‌స్టసీ మాత్రలు, ఎండీఎంఏ వంటి వాటిని నైజీరియన్‌ ముఠాల ద్వారా బెంగళూరు సహా ఇతర నగరాలకు సరఫరా చేస్తుంటారని సమాచారం. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి మత్తు మాత్రలు, ఇంజక్షన్లను తెప్పించుకుని వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు.
* ఇంకొందరు యువకులు గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన డబ్బును ఉపయోగించి డార్కెనెట్‌ ద్వారా ఆర్డర్లు ఇచ్చి ఎల్‌ఎస్‌డీ, కొకైన్‌ తెప్పించుకుని, వాటిని ఇతర నగరాలకు చేరవేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.