ETV Bharat / state

వేతన బకాయిలు చెల్లించాలంటూ.. భాషా వాలంటీర్ల ఆందోళన - మన్యంలో భాషా వాలంటీర్ల ఆందోళన వార్తలు

పనికి తగ్గ వేతనం చెల్లించాలని విశాఖ జిల్లా పాడేరులో భాషా వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. తమకు గౌరవ వేతనంగా ఇచ్చే రూ.5వేలు సరిపోవటం లేదని వాపోయారు. ఆ జీతం అయినా సరిగ్గా ఇవ్వటం లేదని.. తమ బకాయిలు చెల్లించాలని పాడేరు ఐటీడీఏ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. సమస్యను పరిష్కరించాలని.. ఐటీడీఏ అధికారి సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డికి ఫోన్​ ద్వారా విజ్ఞప్తి చేశారు.

protest
protest
author img

By

Published : Apr 24, 2021, 7:21 PM IST

పనికి తగిన వేతనం ఇవ్వాలంటూ.. విశాఖ జిల్లా పాడేరులో భాషా వాలంటీర్లు విశాఖ జిల్లా పాడేరులో ఆందోళన చేపట్టారు. పాడేరు ఏజెన్సీలో 11 మండలాల్లోని గిరిజన సంక్షేమం మండల పరిషత్ పాఠశాలల్లో.. భాషా వాలంటీర్లుగా 669 మంది పని చేస్తున్నారు. వీరు కువి, కొండ దొర, ఆదివాసి కోయ భాషల్లో ఉన్న పాఠాలను తెలుగులో బోధిస్తున్నారు. ప్రభుత్వ చదువులు.. ప్రాథమిక దశలో తెలుగులోనే ఉన్న కారణంగా.. గిరిజన విద్యార్థులకు తెలుగు అర్థం కావటం లేదు. ఈ కారణంగా.. వారు తెలుగు భాష అర్థంకాక చదువులో వెనుకబడిపోతున్నారు. సమస్యను గుర్తించిన గిరిజన సంక్షేమ శాఖ.. సర్వ శిక్ష అభియాన్ నిధులతో భాష వాలంటీర్లను నియమించింది.

ఏజెన్సీ పరిధిలోని పాడేరు, అనంతగిరి, అరకులోయ, డుంబ్రిగూడ, హుకుంపేట, పెదబయలు, తదితద మండలాల్లో.. 669 మంది భాష వాలంటీర్లు నియమించారు. వీరంతా వారి భాషను తెలుగులో తర్జుమా చేసి బోధించాలి. బీఈడీ, డైట్ డిగ్రీ చేసిన వారిని నియమించారు. వీరికి రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తున్నారు. కానీ, ఆ వేతనం సరిపోవటం లేదని వాపోతున్నారు. ఇచ్చే రూ.5 వేలు సైతం సరిగ్గా ఇవ్వటం లేదని ఆవేదన చెందారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సుమారు 300 మంది భాష వాలంటీర్లు పాడేరు ఐటీడీఏకి చేరుకుని ఆందోళన చేపట్టారు. ప్రాజెక్టు అధికారికి తమ సమస్యలు విన్నవించగా.. వారి బకాయిలు చెల్లించాలని సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మల్లికార్జున్ రెడ్డికి ఫోన్​ ద్వారా వివరించారు.

ఇదీ చదవండి:

అమెరికన్‌ డాలర్ల పేరిట మోసం.. రూ.16 లక్షలు మాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.