ETV Bharat / state

PLASTIC BAN RALLY: విశాఖలో ప్లాస్టిక్ వాడక నిషేధంపై అవగాహన ర్యాలీ..

PLASTIC BAN RALLY: ప్లాస్టిక్​ ప్రజల జీవితాల్లో ఒక భాగమైంది. చేతి సంచిని నమోషీగా భావించి.. మన అనారోగ్యాలకు కారణమైన ప్లాస్టిక్​ను మాత్రం పదిలంగా మోసుకొస్తున్నాము. ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా ప్లాస్టిక్​ నిషేధంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ప్రజలలో మాత్రం చైతన్యం రావడంలేదు. ప్లాస్టిక్​ వాడకం వల్ల భావితరాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాము. తాజాగా ప్లాస్టిక్ వాడకం నిషేధంపై విశాఖ రైల్వేస్టేషన్​లో అవగాహన కార్యక్రమం చేపట్టారు.

PLASTIC BAN RALLY
PLASTIC BAN RALLY
author img

By

Published : Jul 24, 2022, 1:54 PM IST

PLASTIC BAN RALLY: ప్లాస్టిక్ వాడకం నిషేధంపై విశాఖ రైల్వేస్టేషన్​లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. జీవీఎంసీ రైల్వే వాల్తేర్ డివిజన్ సంయుక్త ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్, రైల్వే పరిసరాల్లో ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాల్తేర్ డీఆర్ఎం అనూప్ సత్పతి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీశ, భారత క్రికెటర్ శ్రీకర్ భరత్​లు పాల్గొన్నారు. విశాఖ రైల్వేస్టేషన్ నుంచి నగరంలోకి వెళ్లే ప్రయాణికులకు సూచనలతో కూడిన కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధంపై రైల్వే కళాకారులు చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.