ETV Bharat / state

విశాఖలో పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం

పిచ్చుకలను పరిరక్షించాలంటూ గ్రీన్ క్లైమేట్ టీమ్​ ప్రతినిధులు విశాఖలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎండాకాలంలో వాటి దాహార్తిని తీర్చేందుకు నీటి వసతి ఏర్పాటు చేయాలని విద్యార్థులకు సూచించారు.

author img

By

Published : Mar 15, 2021, 3:11 PM IST

Awareness program
గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధులు

విశాఖలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ప్రతినిధులు పిచ్చుకల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని జాలారిపేట ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. నగరంలో పెరుగుతున్న రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోతున్నాయని.. దాని వల్ల కలిగే అనర్థాలను చెప్పారు. వాటిని సంరక్షించటం వల్ల పర్యావరణానికి జరిగే మేలు గురించి తెలిపారు. ఎండాకాలంలో పక్షుల దాహార్తిని తీర్చేందుకు ప్రతీ ఇంటిపైనా నీటి వసతి ఏర్పాటు చేయాలని విద్యార్థులకు సూచించారు. పిచ్చుకలు నివసించేందుకు అవసరమైన గూళ్లను పిల్లలకు అందించారు. వాటి పరిరక్షణకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఇదీ చదవండి: గుంతకల్ - గుంటూరు రైల్వే సెక్షన్​లో ఆధునీకరణ పనులు.. రేపటి నుంచి రైళ్ల దారి మళ్లింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.