ప్రపంచ హెపటైటిస్ దినాన్ని పురస్కరించుకొని డాక్టర్స్ - ఫార్మసిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో... విశాఖపట్నం బీచ్ రోడ్డులో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యుడు మాధవ్ హాజరయ్యారు. హెపటైటిస్ వ్యాధి కారణంగా గతంలో ఎంతో మంది మృతి చెందేవారని, విస్తృత అవగాహన కార్యాక్రమాల కారణంగా.. ఆ సంఖ్యను తగ్గించగలిగామని చెప్పారు. ప్రజలు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే హెపటైటిస్ వ్యాధి నుంచి రక్షించుకోవచ్చని ఆయన అవగాహన కల్పించారు.
ఇదీ చదవండి : బంగాళాఖాతంలో అల్పపీడనానికి అవకాశం