పరిపాలనా రాజధానికి విశాఖ జిల్లాలోని కాపులుప్పాడ కేంద్రబిందువు కానుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. విశాఖ రాజధాని కాకుండా ఆగదన్నారు. పరిపాలనా రాజధానిగా విశాఖ... రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ప్రజలు ఎవరి ప్రాణాలు వారే కాపాడుకోవాలని మంత్రి అన్నారు. ఎక్కడిక్కడ స్వీయనియంత్రణలో ఉంటూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసకోవాలని సూచించారు.
ఇదీచదవండి పోలవరాన్ని పూర్తి చేసేది సీఎం జగనే: ఎంపీ విజయసాయిరెడ్డి