కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెస్తోన్న మోటార్ వెహికల్ చట్టం తో ఆటో కార్మికులు రోడ్డున పడతారని, ఆటో కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తంచేసారు. విశాఖపట్నంలో ఆటో కార్మిక సంఘం మహాసభను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. నూతన మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వస్తే, ఆటో కార్మికుల ఆదాయం అపరాధ రుసుము, కేసులకే సరిపోతాయని కార్మిక నేతలు పేర్కొన్నారు. మోటార్ వెహికల్ చట్టాన్ని రద్దు చేసి ,కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసారు.
ఇదీచూడండి.ఆంధ్రాతో అరుణ్ జైట్లీ అనుబంధం