ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. ఆరిలోవ శ్రీకాంత్ నగర్‌కు చెందిన భూతల శ్రీనుమహేష్ అనే వ్యక్తి భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తుండగా కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినట్లు స్థానికులు తెలిపారు. ఆటో ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య - ఆర్థిక ఇబ్బందులతో భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
కరోనా లాక్డౌన్ కారణంగా ఆటో ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో మానసికంగా కృంగిపోయి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘనట విశాఖ ఆరిలోవ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.