కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన కారణంగా సింహాచలం గోశాల సహా ఇతర తాత్కాలిక సిబ్బంది తొలగింపు దారుణమని దేవస్థానం మాజీ అధ్యక్షుడు, వంశ పారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు అన్నారు. భక్తుల మనోభావాలు అపహాస్యం చేసేలా కొత్త ఛైర్పర్సన్ కొన్ని అభ్యంతరకర నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎటువంటి సంప్రదింపులు, సహేతుక కారణాలు లేకుండా అమలు చేయడం దారుణమన్నారు.
ప్రసాదం ధరలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. గోశాలలో పౌరసేవా కార్మికులను ఎందుకు తొలగించారని నిలదీశారు. తిరుపతి మినహా సింహాచలం వంటి ఎనిమిది ఆలయాల్లో ఎక్కడా కార్మికులను తొలగించలేదన్నారు. ఈ ఎనిమిది ట్రస్టీల ఎంపికకు సంబంధించిన పద్ధతిని ఎందుకు మార్చారని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. ప్రధాని స్వయంగా ఎవరి ఉద్యోగాలు తీసేయొద్దని చెప్పినా పాటించకపోవడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా భక్తుల విరాళాలు వల్ల సమకూరిన రెవెన్యూ మిగులు ఈ అసాధారణ పరిస్థితుల్లో వాడడం సహేతుకమని హితవు పలికారు.
ఇదీ చదవండి: