ETV Bharat / state

ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు - ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు

మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవం జ‌య‌ప్రదం చేయాల‌ని కోరుతూ మావోయిస్లులు ఆంద్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో క‌ర‌ప‌త్రాల‌ను వెద‌జ‌ల్లారు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసులు కూంబింగ్​ పనులు ముమ్మరం చేశారు.

ఏవోబీలో మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవానికి ఏర్పాట్లు
author img

By

Published : Sep 21, 2019, 5:20 AM IST

ఆంధ్రా ఒడిశా సరిహద్దుల్లో ఈనెల 21న మావోయిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవం మావోలు జరుపుకోనున్నారు. దీంతో స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. వ్యవస్థాపక దినోత్సవం నిర్వహిస్తున్నట్టు మావోయిస్టులు కటాప్ ప్రాంతాల్లో వారం రోజులు ముందు నుంచే కరపత్రాలు వెదజల్లారు. మావోయిస్టు ఉద్యమం తీరుతెన్నులు, పార్టీను ఉన్నత స్థితికి కారకులైన నాయకులు, ఉద్యమంలో అమరులైన మావోల గురించి స్థానికులకు తెలియజేసే విధంగా గ్రామసభలు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. అమరులైన మావోలకు స్థూపాలు వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం పార్టీ ఎత్తుపల్లాలు గురించి చర్చించనున్నట్లు సమాచారం.
కూంబింగ్​ ముమ్మరం చేసిన పోలీసులు
గత ఏడాది మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు సందర్భంగానే అరుకులోయ మాజీ ఎమ్మెల్యేలు కిడారి, సివేరిలను మావోయిస్టులు హత్యచేశారు. ఈ ఏడాది అటువంటి ఘటనలకు తావివ్వకుండా పోలీసులు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సరిహద్దులలో గ్రేహౌండ్స్, స్పెషల్, సీఆర్ఫీఎఫ్ పోలీసులను రంగంలోకి దింపింది.
బిక్కు బిక్కు మంటూ జీవిస్తున్న సరిహద్దు ప్రజలు
నెల రోజుల వ్యవధిలోనే ఇన్ఫార్మర్లంటూ మావోయిస్టులు విశాఖ‌ ఏజెన్సీలో ముగ్గురు గిరిజనులను హతమార్చారు. దీంతో ఆదివాసీ గిరిజన గ్రామాల ప్రజలు బిక్కు బిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవానికి మూడు రోజులు ముందే మావోయిస్టులు ఏవోబీలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. అదేవిధంగా మావోయిస్టు ఉద్యమం గురించి తూర్పు-మల్కన్‌గిరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి అరుణ ఆడియో టేపులు విడుదల చేసినందున సరిహద్దుల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
వారం రోజుల ముందు నుంచే పోలీసులు ఏజెన్సీలో నివసించే రాజకీయ నాయకులకు మైదాన ప్రాంతాలకు తరలిపోవలసిందిగా నోటీసులు జారీ చేశారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు,జి.మాడుగుల,డుంబ్రిగూడ, పెదబయలు, ముంచంగిపుట్టు పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీసు బలగాలను అధికారులు తరలించారు. సీలేరు జ‌ల‌విద్యుత్​ కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండి :

'గిరిపుత్రుల త్యాగాల ఫలితమే జీవో 97 రద్దు'

Intro:AP_VSP_57_MAOIST AAVIRBGHAVA DINOTSAVAM_AV_AP10153Body:దళాలు పోయాయి. వాటి స్థానంలో ఏరియా కమిటీలు వచ్చాయి. పీపుల్స్‌ గెరిల్లా ఆర్మీ(పీజీఏ)స్థానంలఓ పీపుల్స్‌ లిబరుఏషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) ఏర్పాటు చేశారు. వ్యహాలు మార్చారు. విధ్వంసాన్ని ఎక్కువ చేశారు. మరోవైపు అగ్రనేతలు పోలీసుల చేతిలో మరణించారు. స్థానికంగా రి్క్రూట్‌మెంట్‌ తగ్గింది. వరుసగా నేతలను కోల్పోతూ కొంతరకు బలహీనపడింది. సీపీఐ మావోయిస్టు పార్టీ పదిహేనేళ్ల ప్రస్థానమిది. ... పీడబ్ల్యూజీగా ఉన్న సమయంలో ఎందరో మేధావులు పార్టీలో ఉండేవారు. అప్పటి వ్యూఙాలు వేరుగా ఉండేవి. మావోయిస్టులుగా మారిన తరువాత మారిన వ్యూ్యహాలతో నష్టాలను చూశారు. మావోయిస్టు పార్టీకీ కీలకంగా ఉన్న ఏవోబీలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పీపుల్స్‌వార్‌ గ్రూపు లోని నక్సలైట్టు 2004 సెప్టెంబరు 21న సీపీఐ మావోయిస్టులతో విలీనమయ్యారు. పీడబ్ల్యూజీ మావోయిస్టులుగా మారి నేటికి 15 సంవత్సరాలు కావస్తోంది. 2001కు ముందు తాండవ, నాగులకొండ, కోనలోవ, బరి, కోరుకొండ పేరిట దళాలు ఉండేవి. తరువాత దళాలు స్థానంలో వరుసగా ఏరియా కమిటీలను ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఏవోబీలో గాలికొడ, కోరుకొండ, పెదబయలు ఉండగా, తూర్పు డివిజన్‌ మల్కన్‌గిరి డివిజన్‌ కమిటీలకమిటీలను రద్దు చేసి తూర్పు -మల్కన్‌గిరి డివిజన్‌ కమిటీగా మార్పు చేశారు. కొత్తగా మల్కన్‌గిరి,కోరాపుట్‌, విశాఖపట్నం సరిహద్దు(ఎంకేవీబీ)డివిజన్‌ కమిటీను ఏర్పాటు చేశారు. 1987లో సంచలనం సృష్టించిన గుర్తేడులో ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల అపహరణ ఘటనలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర కమిటీ సబ్యుడు వడ్కపురి చంద్రమౌళీ అలియాస్‌ దేవన్న, అతని భార్య కరుణను 2007లో గూడెంకొత్తవీధి మండలం చట్రాయిపల్లి వద్ద పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేఆరు. దీంతో సరిహద్దు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మావోయిస్టు పార్టీ నివ్వెరపోయింది. దీని తరువాత ఏవోబీలో మావోయిస్టుఉద్యమానికి నిర్మాణకర్తలుగా పార్టీ అభివృద్దికి కీలకంగా వ్యవహరించిన మేధావులను కోపలోప్పతూ వచ్చింది. అంతకముందు తూర్పు డివిజన్‌ కమిటీ కార్యదర్శిగా ఏవోబీ ఎస్‌జడ్‌సీ మిలటరీ కమీషన్‌ చీఫ్‌గా వ్యవహరించిన వినయ్‌ రాజమండ్రిలో పోలీసులకు దొరికిపోగా, తరువాత 2010లో తూర్పు డివిజన్‌ కార్యదర్శిగా మిలటరీ కమీషన్‌ చీఫ్‌గా వ్యవహరించిన చడ్డాభూషణం ఒడిశాలోని సిమిలిగుడా వద్ద పోలీసులకు దొరికిపోయారు. 2006లో పుట్టకోట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు తూర్పు డివిజన్‌ కమిటీ నాయకుడు కైలాసం మృతిచెందారు. నాటి నుంచి పోలీసులు మారుమూల గ్రామాలకు చొచ్చుకుపోతున్నారు. 2016 ఏప్రిల్‌లో మావోయిస్టు కీలక నేత కుడుముల రవి అనారోగ్యంతో మృతిచెందగా, అదే ఏడాది కొయ్యూరు మర్రిపాకలు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో అజాద్‌ మృతిచెందాడు. పీడబ్ల్యూజీ నుంచి మావోయిస్టులు మారిన తరువాత మావోయిస్టులు చేసిన అతి పెద్ద సంఘటనలు బలిమెల, అరకు లివిటిపుట్టు ఘటనలు . 2008 జూన్‌ 29న గాలింపు నిర్వహించుకుని తిరిగి బలిమెల జలాశయంపై లాంచీలో ప్రయాణిస్తున్న గాలింపు బలగాలుపై మావోయిస్టులు మూకుమ్మడి దాడి చేయగా, ఈ సంఘటనలో 36 మంది గ్రేహైండ్స్‌ పోలీసులు మృత్యవాత పడ్డారు. ఈ సంఘటన జరిగిన నెలరోజుల వ్యవధిలో కలిమెల వద్ద తూటా రహిత వాహనం పేల్చివేత ఘటనలో 21 మంది పోలీసులు మృతిచెందారు. దీంతో ఏవోబీలో మావోయిస్టుపార్టీపై కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఇరు రాష్ట్రాలు దృష్టిసారించారు. ఈ క్రమంలో సంఘటన జరిగిన ఎనిమిది సంవత్సరాలకు 2016 అక్టోబరు 24న ఏవోబీ సరిహద్దు రామ్‌గుడా వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో 32 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఏవోబీలో మావోయిస్టు ఉద్యమం ప్రారంభమైన నాట ఇనుంచి మావోయిస్టులకు తగిలిని అతి పెద్ద ఎదురుదెబ్బ ఈ సంఘటనలో మావోయిస్టు పార్టీకు కీలకంగా వ్యవహరించిన గణేష్‌ అలియాస్‌ ప్రసాదు, చామెళ్ల కృష్ణ అలియాస్‌ దయ, అర్కే కుమారుడు మున్నా తదితరులు మృత్యవాత పడ్డారు. దీంతో మావోయిస్టు పారీ్ట ఏవోబీలో బలహీనపడింది. తదనంతరం మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సబ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే నేతృత్వంలో సీనియర్‌ నాయకుడు చలపతి, గాజర్ల రవి అలియాస్‌ ఉదయ్‌ లు నేతృత్వంలో మావోయిస్టు పార్టీకు జీవం పోసే్ ప్రయత్నం చేశారు. రెండేళ్లు పాటు పడిలేచిన మావోయిస్టు పార్టీ గత ఏడాది సెప్టెంబరు 23న అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను లివిటుపుట్టు వద్ద హత్య చేశారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తరువాత నుంచి మావోయిస్టులు కదలికలుపై పట్టు సాధఙంచిన పోలీసులు మావోయిస్టుల చర్యలను కొంతవరకు అడ్డుకట్టవేశారు. Conclusion:BYTE:1. ATTADA BAAPUJI, AP, VISAKHA DIST.
2. BODDEPALLI KRISHNARAO, OSD, VISAKHA DIST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.