విశాఖ మహానగర పాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. లెక్కింపు సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ వినయ్ చంద్, విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల అధికారి నాగలక్ష్మి పర్యవేక్షిస్తారు.
నర్సీపట్నంలో...
విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ 28 వార్డుల ఓట్ల లెక్కింపు ఫలితాలను ఒకే సారి వెల్లడించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రత్యేకంగా జనరేటర్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియ మొదటి నుంచి చివరి వరకు వీడియో తీయనున్నట్లు సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు. సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను లెక్కింపు కేంద్రంలోకి అనుమతించబోమని ఆమె స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: అన్ని సజావుగా సాగితే.. మొదటి మూడు గంటల్లోనే ఫలితాలు