ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సంస్థ విశాఖ సెంటర్ ఆధ్వర్యంలో... ఏర్పాటు చేసిన ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ ఎక్స్పో-2019 ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్యనారాయణ, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు ప్రారంభించారు. ఇలాంటి ప్రదర్శనలు నగరవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు అభిప్రాయపడ్డారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను ఆసక్తిగా తిలకించారు. ప్రదర్శనలో భాగంగా విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఏయూ, గీతం, శ్రీ వరాహ ఆర్కిటెక్ట్ కళాశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి;