ETV Bharat / state

సరకుల రవాణాకు ఆర్టీసీ ప్రత్యేక కార్గో బస్సులు - ఏపీలో కరోనా కేసులు

నిత్యావసర సరకులను విశాఖ నుంచి ఇతర జిల్లాలకు రవాణా చేసేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా కార్గో బస్సులను నడపనుంది. 15 ప్రత్యేక గూడ్స్ బస్సులతో పాటు సీట్లు తొలగించిన బస్సులనూ వీటి రవాణా కోసం ఉపయోగించనున్నారు.

apsrtc
apsrtc
author img

By

Published : Apr 27, 2020, 12:45 PM IST

ఆర్టీసీ ద్వారా నిత్యావసర సరకుల రవాణాకు ప్రభుత్వం అనుమతిచ్చింది. విశాఖ నుంచి ఇతర జిల్లాలతో పాటు.. జిల్లాలో అంతర్గతంగా సరఫరా చేసేందుకూ ఈ కార్గో సేవలు అందించనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద ఉన్న 15 ప్రత్యేక గూడ్స్‌ బస్సులతో పాటు.. సీట్లు తొలగించిన మరికొన్ని బస్సులను ఉపయోగిస్తామని ఆర్టీసీ ఆర్‌ఎం ఎం.వై.దానం తెలిపారు.

కూరగాయలు, పండ్లు, ఔషధాలు, ఇతర పంట ఉత్పత్తులతో పాటు ప్రభుత్వం అనుమతిచ్చిన అన్ని నిత్యావసర సరుకులను రవాణా చేయనున్నారు. అనకాపల్లి బెల్లం మార్కెట్‌ నుంచి ఏలూరు, అమలాపురం, రాజమహేంద్రవరం, విజయవాడ, శ్రీకాకుళం జిల్లాలకు ఆరు బస్సుల ద్వారా రవాణా చేస్తారు.

తీర ప్రాంతాల నుంచి ఉప్పు రవాణాకు రెండు బస్సులు, గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి కూరగాయలు తీసుకొచ్చేందుకు ఏడు బస్సులను ఉపయోగిస్తున్నారు. జిల్లాలోని వివిధ రకాల పరిశ్రమల ఉత్పత్తులతో పాటు ఔషధాల రవాణాకు అందుబాటులో ఉంచుతారు. పండ్ల రవాణాకు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

రైల్వే సైతం...

లాక్‌డౌన్‌ వేళ దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు నిత్యావసరాలు అందజేసేందుకు భారతీయ రైల్వే పార్సిల్‌ సేవలందిస్తోందని వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం సునీల్‌కుమార్‌ తెలిపారు. వాల్తేర్‌ డివిజన్‌ ఇప్పటి వరకు 1200కు పైగా రైళ్లను నడిపిందన్నారు. బియ్యం, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు, ఐరన్‌, స్టీల్‌ను తరలిస్తున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి, పెందుర్తి, జైపూర్‌ తదితర ప్రాంతాల నుంచి ఆదోని, వైట్‌ఫీల్డ్‌, జోవి, కడప, హుబ్లీ, చెంగన్‌పల్లి, అమరావతి కాలనీ, త్రిశూర్‌ తదితర ప్రాంతాలకు 37 రైళ్లలో లక్ష టన్నుల ఆహార ధాన్యాలు రవాణా చేసినట్లు వెల్లడించారు. వాల్తేర్‌ డివిజన్‌ 514 టన్నుల పండ్లు, కూరగాయలు, 15 టన్నుల చేపలు, పాలు, పాల ఉత్పత్తులు, మందులు, వైద్య పరికరాలు కిరాణ సామగ్రి రవాణా చేసినట్లు వెల్లడించారు.

ఆర్టీసీ సేవలకోసం సంప్రదించాల్సిన ఫోను నెంబర్లు:

  • విశాఖపట్నం 99592 25594
  • మద్దిలపాలెం 99592 25597
  • వాల్తేరు 99592 25590
  • సింహాచలం 99592 25592
  • గాజువాక 99592 25591
  • స్టీలు సిటీ 99592 25593
  • మధురవాడ 89782 00455
  • అనకాపల్లి 99592 25595
  • నర్సీపట్నం 99592 25596
  • పాడేరు 94406 28092
  • ద్వారకా బస్టాండు 73311 47261

ఇవీ చదవండి:

దేశంలో 872కు పెరిగిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.