విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కాపునాడు అధ్యక్షుడిగా జగతా శ్రీనివాస్ నియామకం అయ్యారు. ఈమేరకు కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గాళ్ల సుబ్రహ్మణ్యం నుంచి జగతా శ్రీనివాస్‌కు నియామక పత్రం అందింది. నియోజకవర్గ౦లో కాపు సామాజిక వర్గం అభివృద్ధికి, విద్య, ఉద్యోగ, వ్యాపార, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో మరింతగా రాణించేందుకు తనవంతు కృషి చేస్తానని శ్రీనివాస్ తెలిపారు. తనకు పదవి కేటాయించిన కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు గొల్లపల్లి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎల్. నరసింహులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: