ETV Bharat / state

ERC MEETING: స్లాబులు మార్చి పేదలపై భారం మోపుతారా? - vishakapatnam latest news

ERC MEETING: సినిమా టిక్కెట్లు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తున్న ప్రభుత్వం.. తన పరిధిలోని విద్యుత్తు ధరలను ఎందుకు నియంత్రించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌.బాబూరావు ప్రశ్నించారు. విశాఖలోని ఈపీడీసీఎల్‌ కార్యాలయంలో సోమవారం ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి అధ్యక్షతన విద్యుత్తు టారిఫ్‌ల మార్పులపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.

ఈఆర్సీ సమావేశం
ఈఆర్సీ సమావేశం
author img

By

Published : Jan 25, 2022, 7:04 AM IST

ERC MEETING: సినిమా టిక్కెట్లు, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజులను నియంత్రిస్తున్న ప్రభుత్వం.. తన పరిధిలోని విద్యుత్తు ధరలను ఎందుకు నియంత్రించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌.బాబూరావు ప్రశ్నించారు. విశాఖలోని ఈపీడీసీఎల్‌ కార్యాలయంలో సోమవారం ఏపీఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి అధ్యక్షతన విద్యుత్తు టారిఫ్‌ల మార్పులపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి పలువురు వర్చువల్‌గా మాట్లాడారు. విజయవాడ నుంచి బాబూరావు మాట్లాడుతూ ‘సంక్షేమ పథకాల అమలుకు 300 యూనిట్లలోపు వాడేవారిని ప్రభుత్వం పేదలుగా గుర్తిస్తే, డిస్కంలు 30 యూనిట్ల పరిధిని ఎలా నిర్ణయిస్తాయి? స్లాబులు మార్చి, పేదలపై భారం మోపుతూ ధనికులకు రాయితీలిస్తారా?’ అని ప్రశ్నించారు. వచ్చే ఏడాది ట్రూఅప్‌ ఛార్జీలతో పాటు స్లాబుల మార్పు, ఇతర ఛార్జీల కింద రూ.12 వేల కోట్ల భారం వేయబోతున్నారని వాపోయారు. దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని 25 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టడాన్ని ఆక్షేపించారు. వ్యవసాయ విద్యుత్తు మీటర్ల కొనుగోలులో 107 శాతం ఎక్కువకు టెండర్లు ఖరారు చేశారని, ఉచిత విద్యుత్తు ఇస్తున్నప్పుడు మీటర్లతో పనేంటని ప్రశ్నించారు. ‘మిగులు విద్యుత్తు ఉందంటూ ప్రభుత్వ థర్మల్‌ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపేస్తూ, అదనంగా 7 వేల మెగావాట్ల విద్యుత్తును అదానీ కంపెనీ నుంచి కొనుగోలుకు ఎలా ఒప్పందం చేసుకుంటారు? దాన్ని ఈఆర్సీ మూడు రోజుల్లోనే ఎలా ఆమోదించింది?’ అని బాబూరావు ప్రశ్నించారు. ఈఆర్సీ ఛైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి స్పందిస్తూ, ‘మేం తప్పు చేశామని కోర్టుకు వెళ్లారు కదా! అక్కడే తేల్చుకోండి. రాజకీయ ఉద్దేశాలుంటే వేరే చోట మాట్లాడుకోవాల’న్నారు.

వామపక్షాల నిరసన
జీవో 161లో ఏముందో ఎందుకు బయటపెట్టడం లేదని విశాఖకు చెందిన సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి లోకనాథం ప్రశ్నించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ కేంద్రం బొగ్గు గనులను కేటాయించకపోవడంతో ప్రైవేటుగా కొనుగోలు చేయడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని చెప్పారు. స్లాబులు కుదించడంపై పలువురు అభ్యంతరం చెప్పారు. అంతకుముందు డిస్కమ్‌ కార్యాలయం ఎదుట విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.

ఇదీ చదవండి:

గుడివాడ క్యాసినోపై జాతీయ సంస్థలకు ఫిర్యాదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.