ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం విశాఖ జిల్లా మాడుగుల మోదకొండమ్మ జాతర రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ పుప్పాల అప్పలరాజు ప్రకటించారు. వచ్చే నెలలో జరుగనున్న జాతర.. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్నందున రద్దు చేస్తూ ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ప్రజలు ఇళ్లలోనే పూజలు చేసుకోవాలని సూచించారు. గతేడాది కూడా అమ్మవారి జాతర కరోనా ప్రభావంతో రద్దు చేశారు.
ఇదీ చదవండి: రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు