విశాఖ ఎంవీపీ కాలనీలోని తితిదే కళ్యాణ మండపంలో దివ్యాంగులకు ఉచిత కృత్రిమ అవయవాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం భగవాన్ మహావీర్ సహాయత సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐదవ తేది నుంచి 9వ తేదీ వరకు ఐదురోజుల పాటు ఈ శిబిరం కొనసాగనుంది. ఇప్పటికే... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆధార్ నెంబర్ నమోదు చేసుకుని కృత్రిమ అవయవాలు అమరుస్తున్నారు. గతంలో కృత్రిమ అవయవాలు ఉండి... వాటికీ చిన్న చిన్న మరమ్మతులు ఉంటే చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50 వేలమందికి ఈ కృత్రిమ అవయవాలు అందించినట్టు సంస్థ నిర్వాహకులు చెప్తున్నారు.
ఇవీ చదవండి