- అధికారుల తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం.. ఎందుకంటే..!
వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన.. ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూర్చిందోనని తెలుసుకునేందుకు.. నెల్లూరు జిల్లా ఎమ్మేల్యేలు, మంత్రులు, యంత్రాంగం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.. అయితే ఈ సమావేశంలో ఊహించని విధంగా.. ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసహనం ఎదురైంది.. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అదేంటో చూద్దామా మరీ..!
- తిరుపతి జిల్లాలో యథేచ్చగా మట్టి మాఫియా.. టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్థులు
మట్టి మాఫియా ఆగడాలు శృతిమించుతున్నాయని.. నెన్నూరు గ్రామస్థులు టిప్పర్లను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి నిరసన తెలిపారు. రెండేళ్లుగా టిప్పర్ల వల్ల నానా ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే నాథుడు లేడంటూ గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థులు, పోలీసుల మధ్య మాటా మాటా పెరిగి స్వల్ప వాగ్వాదం జరిగింది.
- మత్స్యకారులను వరించిన అదృష్టం.. వలలో పడిన 340 కిలోల చేప
బంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని హుగ్లీ నదిలో వేటకు వెళ్లిన మత్స్యకారులను అదృష్టం వరించింది. మాహిష్మరి ప్రాంతానికి చెందిన మత్స్యకారుల వలలో 340 కిలోల భారీ చేప పడింది. దీంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ చేప ధర దాదాపు రూ.50 వేలు ఉంటుందని తెలిపారు. చేపను ఒడ్డుకు తరలిస్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
- భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్.. దిల్లీలో రాహుల్‌తో కలిసి నడక
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర'లో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ పాల్గొననున్నారు. దిల్లీలో శనివారం రాహుల్‌తో కలిసి కమల్ నడవబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
- 'ట్రంప్ గోడ' దూకబోయి భారతీయుడు మృతి.. ఇద్దరికి గాయాలు
అమెరికా- మెక్సికో సరిహద్దు గోడ వద్ద విషాదకర ఘటన జరిగింది. 'ట్రంప్ గోడ'ను దూకబోయి అమెరికాలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ భారతీయ కుటుంబంలో ఒకరు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు.
- చైనాలో కొవిడ్ డేంజర్ బెల్స్.. రోగులతో ICUలు ఫుల్ బెడ్లు లేక నేలపైనే
చైనాలో కరోనా వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా ఉంది. వైరస్ బాధితులతో ఐసీయూలన్నీ నిండిపోయాయి. బెడ్లు సరిపోక నేలపైనే చికిత్స అందిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది చివరికల్లా చైనాలో పది నుంచి 20 లక్షల మరణాలు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- IPL Mini auction: ఐపీఎల్ చరిత్రలో రికార్డ్ ధరకు సామ్ కరణ్
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ సామ్ కరన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ మినీ వేలంలో అతడు రికార్డు ధరకు అమ్ముడయ్యాడు. ఇవాళ జరిగిన వేలంలో కరన్ కోసం ముంబయి, పంజాబ్ తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు
- వెండి తెర ఐశ్వర్యం
తెలుగు తెరపై ఓ చిన్న మెరుపులా మెరిసిన కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య మీనన్..