- వివేకాను చంపినంత సులువుగా.. నన్ను, లోకేశ్‌ను చంపాలని చూస్తున్నారు: చంద్రబాబు
CBN FIRES ON CM: వివేకా హత్యకేసులో సుప్రీం తీర్పుపై ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని.. లేకుంటే రాజీనామా చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. బాబాయిని చంపిన వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని అన్నారు. బాబాయ్‌ని చంపినంత సులువుగా తననూ చంపొచ్చని జగన్ అనుకుంటున్నారని.. ఇప్పుడు లోకేశ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా..మరి అవి ఏంటి?: లోకేశ్
LOKESH FIRES ON CM JAGAN : ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను దూరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నారా లోకేశ్ మండిపడ్డారు. ఒక్క ఎన్నికల విధులు మాత్రమే బోధనేతర పనులా అంటూ.. ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అభివృద్ధి చేస్తారని భూములిస్తే.. ఇలా చేస్తారా..!'
Thimmamma Marrimanu: తమ ప్రాంతం గొప్ప పర్యాటక కేెంద్రంగా మారుతుందని భూములిస్తే.. ఇప్పుడు దేవాదాయశాఖ తీసుకోవడం ఏంటని నంబుల పూలకుంట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు వారు చేపట్టిన నిరసనలకు జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సర్పంచుల న్యాయబద్దమైన డిమాండ్లు నెరవేర్చాలి: బాబూ రాజేంద్రప్రసాద్
Babu Rajendra Prasad: రాష్ట్రంలో సర్పంచులు తమ కష్టాలను తెలిపేందుకు.. కాలినడకన తిరుమలకు పాదయాత్రగా చేపడితే అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. ఉదయం రాష్ట్ర సర్పంచుల సంఘం సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయన మాట్లాడారు. సర్పంచుల కోరుతున్న 12 న్యాయబద్దమైన డిమాండ్లను నెరవేర్చేలా ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'PFIపై నిషేధం కరెక్టే'.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైనదేనని కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పింది. ఇస్లాం అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని కేంద్రం.. ఆ సంస్థపై నిషేధం విధించడం సబబేనని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పట్టాలు తప్పిన రైలు.. ఎదురుగా వస్తున్న ట్రైన్‌ను ఢీకొని..
బంగాల్లో పట్టాలు తప్పిన ఓ రైలు మరో లోకల్ ట్రైన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అఫ్గాన్ స్కూల్లో బాంబు దాడి.. 16 మంది విద్యార్థులు మృతి
అఫ్గానిస్థాన్‌లోని ఓ పాఠశాలలో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు చనిపోయారు. అఫ్గానిస్థాన్‌లో దారుణం జరిగింది. ఓ మతపరమైన పాఠశాలపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు మరణించారని తాలిబన్ అధికారులు తెలిపారు. మరో 14 మంది గాయపడ్డారని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అదానీ 'ఎంట్రీ'తో రాధిక, ప్రణయ్ రాజీనామా.. ట్రేడింగ్‌లో దూసుకెళ్లిన NDTV షేరు
ఎన్డీటీవీ ప్రమోటర్ గ్రూప్ ఆర్ఆర్పీఆర్కు ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ రాజీనామా చేశారు. వారి స్థానంలో ముగ్గురు కొత్త డైరెక్టర్లను అదానీ గ్రూప్‌నకు చెందిన ఆర్ఆర్పీఆర్ బోర్డు నియమించింది. ఈ పరిణామాల మధ్య ట్రేడింగ్‌లో ఎన్డీటీవీ షేరు దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- NZ vs IND: మ్యాచ్ వర్షార్పణం.. కివీస్‌దే సిరీస్
మ్యాచ్ వర్షార్పణం మూడో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో భారత్‌పై మూడు వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకొంది. తొలి వన్డేను కివీస్ గెలుచుకోగా.. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. మూడో వన్డే మ్యాచ్‌లో ఇంకో రెండు ఓవర్ల ఆట జరిగి ఉంటే డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం న్యూజిలాండ్ విజయం సాధించేది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రాష్ట్రంలో 'అవతార్-2' ప్రదర్శన రద్దు..కారణం ఇదే..?
అవతార్-2 సినిమా కోసం సినీప్రియులు ఎంతో అసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబరు 16న ఈ చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆ రాష్ట్రంలో విడుదలకు నో చెప్పారంటా..! ఎందుకంటే.?పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.