- గేట్లు పెట్టి.. తాళాలు వేసి.. ఇసుక దోపిడీ
Sand Irregularities in Anantapur Penna River: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. పెన్నా నదికి వెళ్లే మార్గంలో టోల్‌గేట్లు ఏర్పాటుచేసి, వాటికి తాళాలు వేసి మరీ దందా నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక రీచ్‌గా ప్రకటించకపోయినా.. నదిలో 20 అడుగుల మేర తవ్వేసి పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు యథేచ్ఛగా ఇసుక తరలించేస్తున్నారు. దీనివెనుక స్థానిక వైకాపా ప్రజాప్రతినిధి అనుచరులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజధాని అమరావతిలో స్థానికేతరులకు స్థలాలపై విచారణ వాయిదా
AP HIGH COURT: రాజధాని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇస్తామనే విషయంపై హైకోర్టులో విచారణ జరిగింది. రైతుల తరఫు వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ తరఫు వాదనల విచారణ కోసం మంగళవారానికి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఇకపై నెలనెలా పెరగనున్న కరెంట్ బిల్లు.. అప్పటి నుంచే అమలు..
Current bills To increase in Telangana: పెట్రోలు, డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నట్లే ఇంటి కరెంటు బిల్లు కూడా వచ్చే ఏప్రిల్ నుంచి నెలనెలా పెరగనుంది. ఇలా ఛార్జీలు పెంచడానికి ‘విద్యుత్ పంపిణీ సంస్థ’లు ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛాయుత అధికారమిస్తూ ఈఆర్సీ ముసాయిదా ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డాక్టర్ డుమ్మా: సర్కారీ జీతం తీసుకుంటున్నా.. వైద్యుల ధ్యాసంతా 'ప్రైవేటు'పైనే
మౌలిక సదుపాయాలున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలు అరకొరగా మాత్రమే లభ్యమవుతున్నాయి. సర్కారీ జీతం తీసుకుంటున్నా.. వైద్యుల ధ్యాసంతా ప్రైవేటు ప్రాక్టీసుపైనే ఉంటోంది. బోధనాసుపత్రుల్లో సేవలు మరీ తీసికట్టుగా ఉన్నాయని వైద్యశాఖ తేల్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెండేళ్ల తరువాత కనిపించిన అరుదైన నల్ల చిరుత
బంగాల్లో రెండేళ్ల తరువాత అరుదైన ఓ బ్లాక్ పాంథర్ కనిపించింది. మిరిక్‌లోని తేయాకు తోటలో రోడ్డు దాటుతున్న నల్ల చిరుతను ఓ వ్యక్తి కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా బ్లాక్ పాంథర్ ఫొటోలు వీడియో వైరల్‌గా మారాయి. అంతకుముందు 2020లో ఇదే ప్రాంతంలో బ్లాక్ పాంథర్ కనిపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గుజరాత్‌లో పశువుల చుట్టూ రాజకీయం.. పోటీపడి ప్రత్యేక హామీలిస్తున్న పార్టీలు
ఎక్కడైనా ఎన్నికలు జరిగితే రాజకీయ నాయకులు ప్రజల చుట్టూ ప్రదక్షిణ చేయటం ఆరంభిస్తారు. గుజరాత్‌లో మాత్రం ప్రజలతో పాటు గోవులు, పశువుల చుట్టూ రాజకీయం తిరుగుతోంది. ఆ రాష్ట్రంలో అన్నీ పార్టీలు పోటీపడి మరీ పశుసంరక్షణ కోసం హామీలు, తాయిలాలు ప్రకటిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చైనాలో కరోనా ఉగ్రరూపం.. ఎన్నడూ లేని స్థాయిలో రోజువారీ కేసులు
చైనాను కరోనా వైరస్ హడలెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆ దేశంలో భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తాజా రేట్లు ఇవే
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సూర్యకుమార్‌కు మా లీగ్‌లో నో ఛాన్స్.. కొనేందుకు ఇక్కడ డబ్బులు లేవు'
ఇప్పుడు ఎక్కడ చూసినా సూర్యకుమార్ పేరు మారుమోగిపోతోంది. టీ20 ఫార్మాట్‌లో అదరగొట్టేస్తున్నాడు. విభిన్నషాట్లతో మైదానం నలువైపులా షాట్ల కొడుతూ మిస్టర్ 360 ఆటగాడిగా పేరొందాడు. తాజాగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్.. సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏమన్నాడంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నటుడు కమల్ హాసన్‌కు స్వల్ప అస్వస్థత.. చెన్నై ఆస్పత్రిలో చికిత్స
సినీనటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స నిమిత్తం బుధవారం రాత్రి చేరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.