మీరు రోడ్లు వద్దంటారు.... మాకు రోడ్లు కావాలి, మీరు ఫోన్లు వద్దంటారు.... మాకు సెల్ టవర్లు కావాలి, మీరు అవుట్ పోస్ట్ వద్దంటారు.. మాకు రక్షణ కావాలి... మాకు ఉపాధి, ఉద్యోగాలు కావాలి.. మీరు పనులు వదిలేసి ర్యాలీలు ధర్నాలు చేయమంటారు.. మావి అవసరాలు.. మీవి అడ్డంకులు... ఏం చెబుతున్నారు వీళ్లు అనుకుంటున్నారా..? అసహనంతో.. ఆగ్రహించిన ఆవేదన.. పోస్టర్ల రూపంలో గోడలపై వెలసింది.
విశాఖ ఏజెన్సీ మారుమూల మద్దిగరువు పరిసర ప్రాంతాల్లో మేల్కొనండి ఇప్పటికన్నా.. మన్యాన్ని వీడండి అంటూ మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఇటీవల ఆంధ్ర ఒడిశా సరిహద్దు జంతురాయిలో మావోయిస్టులపై గ్రామస్థులు తిరుగుబాటును గుర్తు చేశారు. అయితే ఇటీవల కాలంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువ కావడం వల్ల.. ఇలాంటి పోస్టర్లు వెలుస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: