ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయిన అనకాపల్లి - ఆనందపురం రహదారి (ఎన్‌హెచ్-16) ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా లేదు. కరోనా కారణంగా పనులు స్తంభించిపోయాయి. రూ.2,300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ రహదారిని 36 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికి 21 నెలలు గడిచిపోయాయి. 15 నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా సగానికి పైగా పనులు మిగిలి ఉన్నాయి. కేవలం 5కి.మీ..మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయింది. భూసేకరణలో నష్ట పరిహారం పూర్తిగా చెల్లించని కారణంగా కొంత మంది రైతులు పనులు అడ్డుకొంటున్నారు.
పనులు ఎలా జరుగుతున్నాయంటే..
- సబ్బవరం మండలంలో మర్రిపాలెం నుంచి పినగాడి వరకు సుమారు 15కిలోమీటర్లలో 2.3 కి.మీ మేర బైపాస్ రహదారి ఏర్పాటు చేయాల్సి ఉంది. మర్రిపాలెం నుంచి జాగారపువానిపాలెం వరకు చిన్నచిన్న పనులు మినహాయిస్తే 6 లైన్ల నిర్మాణం పూర్తయింది. సుమారు 5కి.మీ. ఏ అడ్డంకులు లేకుండా వాహనాలు పరుగులు తీస్తున్నాయి.
- జాగారపువానిపాలెం నుంచి సున్నం బట్టీల వరకు 1 కి.మీ మేర కేవలం సర్వీసు రహదారి మాత్రమే పూర్తయింది.
- బైపాస్‌లో అసకపల్లి వద్ద నాలుగు ప్రధాన రహదారులతోపాటు మరో సర్వీసు రహదారి నిర్మించాల్సి ఉంది. అక్కడి నుంచి 2.3 కిమీ దూరం వరకు బైపాస్ రహదారిలో, చిన్నయ్యపాలెం బంకు నుంచి పినగాడి వరకు సుమారు 5కిమీ మేర పనులు అరకొరగా జరిగాయి.
కూలీలు లేక ఆగిన పనులు
లాక్‌డౌన్ వల్ల మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు ఉపాధి లేక స్వస్థలాలకు వెళ్లిపోయారు. తిరిగి పనులు మొదలవ్వాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రాజెక్టు గడువు మరో ఆరు నెలలకు పెంచినట్లు సమాచారం.
పూర్తయిన పైవంతెనలు ఇవీ
● బంజరు వద్ద
● అసకపల్లి బైపాస్
● సున్నంబట్టీల వద్ద
● చిన్నయ్యపాలెం బొర్రమ్మ గెడ్డ వద్ద
పూర్తి కావాల్సినవి..
● పినగాడి కూడలి ●మొగలిపురం కూడలి
● పెందుర్తి బైపాస్ రహదారిలో..