ఆంధ్ర విశ్వ కళా పరిషత్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం డిసెంబరు 13న విశాఖలో జరగనున్నట్లు విశ్వ విద్యాలయ అధికారులు తెలిపారు. విశాఖ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరగబోయే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీఎం జగన్, విశిష్ట అతిథిగా టెక్ మహీంద్రా సీఈవో హాజరవుతారని విద్యాలయ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వ కళా పరిషత్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం-2019 ప్రచార పత్రికను ఉపకులపతి ఆచార్య ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు. పూర్వ విద్యార్థులంతా www.andhrauniversityalumni.com ఈ వెబ్సైట్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని వర్శిటీ యాజమాన్యం కోరింది.
ఇదీ చదవండి