విశాఖ జిల్లా సబ్బవరం మండలం అసకపల్లిలో ఓ గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సరుగుడు తోటలో ఓ వ్యక్తి మృతదేహన్ని సగం వరకు పూడ్చిపెట్టడాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి... వసతిగృహంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య