అమూల్ డెయిరీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పాల సేకరణ యూనిట్లను ప్రభుత్వం ప్రారంభిస్తోంది. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో డెయిరీలు ఏర్పాటు చేశారు. అదే స్ఫూర్తితో ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను కలిపి ఒక యూనిట్‌గా తీసుకుని ఈ పథకానికి శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.
పాడి రైతులకు చేయూతనిచ్చేందుకు అముల్ డెయిరీ యూనిట్ల ప్రారంభంతో పాటు..పాల ధర లీటరుకు నాలుగు రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని మహిళా పాడి రైతులకు వైఎస్సార్ చేయూత పథకం కింద రాయితీపై పాడిపశువులను అందజేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందుకోసం వెలుగు కార్యాలయం ద్వారా జిల్లా పశు సంవర్ధక శాఖ సహకారంతో మేలుజాతి పశువులను సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉపా చట్టం కేసు వ్యవహారంలో.. అన్నపూర్ణ అరెస్టు