రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో అంబేద్కర్ విద్యార్థి సంఘం ఆందోళన చేపట్టింది. డాబాగార్డెన్స్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. రెండు నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులను కూడా ఈ పథకంలో చేర్చాలని కోరారు.
దళిత విద్యార్థులను విద్యకు దూరం చేసే ఉద్దేశ్యంతో వైకాపా ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పథకాన్ని యధావిధిగా కొనసాగించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: