Amaravati Capital : అమరావతి రైతు జేఏసీ నాయకుడు గద్దె తిరుపతిరావు అమరావతి రైతుల పాదయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. భీమునిపట్నం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. గతంలో అమరావతికి మద్దతుగా రైతులు పాదయాత్ర నిర్వహించగా, అనివార్య కారణాల వల్ల ఆపినట్లు ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మళ్లీ గత పది రోజులుగా పాదయాత్రను నిర్వహిస్తున్నట్లు గద్దె తెలిపారు.
రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో కలిపి.. ఇప్పుడున్న వైసీపీతో కూడా అందరూ కలిసే.. అమరావతి రాజధానిగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధానిని మారుస్తారా అని ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అమరావతిపై వెచ్చించరాన్నారు.
రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలే తప్పా.. నాశనం చేయకూడదని విమర్శించారు. న్యాయ వ్యవస్థలో అమరావతి రాజధాని అంశంలో పూర్తి స్పష్టత వచ్చినప్పటికీ అమలు చేయకపోవటం దురదృష్టకరమన్నారు. అమరావతి రైతులకు మంచి విలువలు ప్రసాదించాలని శ్రీకాకుళంలోని సూర్యభగవానుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో రెండు రోజుల్లో పాదయాత్ర అరసవల్లికి చేరుకుంటుందని ఆయన తెలిపారు.
"అమరావతి నుంచి అరసవల్లి వరకు గతంలో పాదయాత్ర నిర్వహించాము. అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అది ఆగిపోయిన చోటు నుంచే అరసవల్లి వరకు పాదయాత్రను కొనసాగిస్తున్నాను. బుధవారం విశాఖపట్టణం చేరుకున్నాను. అమరావతి నిర్మాణం వల్లే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అవుతుంది." -గద్దె తిరుపతి రావు, అమరావతి ఐకాస నాయకుడు
ఇవీ చదవండి :