ETV Bharat / state

లాంగ్​మార్చ్​కు సర్వం సిద్దం.. తరలివస్తున్న జన సైనికులు - జనసేన లాంగ్ మార్చ్

ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు ఏర్పడ్డ తీవ్ర సంక్షోభాన్ని నిరసిస్తూ... జనసేన అధినేత పవన్​కల్యాణ్ తలపెట్టిన చలో విశాఖకు సర్వం సిద్దమైంది. దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు లాంగ్ మార్చ్ చేసేందుకు అధికారులు అనుమతిచ్చారు. జనసైనికులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే పార్టీ ప్రతినిధులు పిలుపునివ్వటంతో అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.

లాంగ్​మార్చ్​కు సర్వం సిద్దం
author img

By

Published : Nov 2, 2019, 9:55 PM IST

Updated : Nov 2, 2019, 10:13 PM IST

లాంగ్ మార్చ్​కు సిద్దమైన జనసేన

విశాఖపట్నంలో జనసేన పార్టీ తలపెట్టిన లాంగ్ మార్చ్​కి ఏర్పాట్లను ఆ పార్టీ సిద్దం చేస్తోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం విశాఖ చేరుకుని మధ్యాహ్నం 3గంటలకు మద్దిలపాలెం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు దాదాపు 2.8 కిలోమీటర్ల మేర లాంగ్​మార్చ్ నిర్వహిస్తారు. 13 జిల్లాల నుంచి జన సైనికులు ఈ లాంగ్ మార్చ్​లో పాల్గొనున్నారు. వివిధ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసినవారికి, నియోజకవర్గ ఇంఛార్జిలకు కార్యక్రమ బాధ్యతలను అప్పగించారు.

లాంగ్​మార్చ్​కు తెదేపా.. దూరంగా భాజపా..
లాంగ్​మార్చ్​కు తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రులైన అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడులు హాజరుకానున్నారు. తమకు నాల్గొవ తేదీన ఉన్న నేపథ్యంలో హాజరు కాలేమని భాజపా తేల్చి చెప్పింది. ఇదిలావుంటే.. భాజపా మద్దతు కోరినందున తాము పాల్గొనలేమని వామపక్ష నేతలు తెలిపారు. అయితే తమ సంఘీభావం ఉంటుందని స్పష్టం చేశారు.

లాంగ్​మార్చ్ అనంతరం ఏం చేస్తారు?
రాష్ట్రంలో ఇసుక విధానం, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేయటం, ఆత్మహత్యలకు పాల్పడటం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఈ లాంగ్​మార్చ్ ద్వారా నిలదీస్తారని సమాచారం. అనంతరం విశాఖ మహిళా కళాశాల ఎదురుగా జనసేన బహిరంగ సభ నిర్వహించనుంది. ఇందులో ప్రభుత్వ ఇసుక విధానంలో తీవ్రస్థాయిలో ఉన్న లోపాలను ఎత్తి చూపనున్నారు.

పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ ద్వారా భవన నిర్మాణ కార్మికులకు మేలు చేకూరుతుందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.

ఇదీ చూడండి

పవర్ స్టార్ అభిమానులు పండుగ చేసుకునే వార్త..

Intro:Body:Conclusion:
Last Updated : Nov 2, 2019, 10:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.