దాతల సహకారంతో విశాఖలో భోజన పొట్లాల పంపిణీ కార్యక్రమాన్ని.. అక్షయ పాత్ర ఫౌండేషన్ ముమ్మరం చేసింది. వివిధ ఆసుపత్రుల వద్ద ఉన్న రోగుల సహాయకులకు వీటిని అందజేస్తున్నారు. వారి సేవలను రైల్వే స్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాలకు సైతం విస్తరించింది. కర్ఫ్యూ వల్ల ఎటువంటి అసరా లేకుండా ఉండిపోయిన వారికి ఆహారం పెడుతున్నారు.
విశాఖలో రోజుకి 3,000 ఆహార పొట్లాలను వితరణ చేస్తున్నట్లు సంస్థ వివరించింది. కొవిడ్ నిబంధనల ప్రకారం.. అక్షయ పాత్ర ఫౌండేషన్ భోజన సరఫరా వాహనాలను ఇందుకు వినియోగిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వారి సేవలు ఎంతో ఉపకరిస్తున్నాయని.. ఆసుపత్రుల్లో ఉన్న రోగుల సహయకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: