విశాఖ చుట్టుపక్కల భారీ పరిశ్రమలున్నాయి. జిల్లాలో 150కి పైగా ఫార్మా కంపెనీలున్నాయి. ఇక ఉత్తరాంధ్రలోనైతే తయారీ పరిశ్రమలు ఎక్కువే. గంటల్లో ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు చేరేలా ఉండే ఉత్పత్తుల్ని మాత్రమే విమాన కార్గో(air cargo)లో పంపుతారు. ఈ తరహా ఉత్పత్తులే నెలకు ఉత్తరాంధ్రవ్యాప్తంగా.. 1700టన్నులకు పైగా ఉంటాయని అంచనా. ఏళ్లు గడుస్తున్నా.. విశాఖ విమానాశ్రయంలో సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల.. సుమారు ఈ సరకు పూర్తిగా రోడ్డు మార్గాన ప్రత్యేక వాహనాల్లో.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్తోంది.
విశాఖకు ఆశించిన మేర పరిశ్రమలు, సంస్థలు రాకపోవటానికి విమాన కార్గో సేవలు పూర్తిస్థాయిలో లేకపోవడమేనని వాణిజ్యవేత్తలు అంటున్నారు. ఒకవేళ విశాఖ విమానాశ్రయంలో కార్గో సేవల్ని ఉన్నతీకరిస్తే.. మంచి ఫలితాలొస్తాయంటున్నారు.
కార్గో.. విదేశాలకు వెళ్లాలంటే హైదరాబాద్ వెళ్లి అక్కడ సరకును బుక్ చేసుకుంటున్నారు. అంతా బాగుంటే విశాఖలోనే ఈ పనిచేయొచ్చు. కానీ విశాఖ విమానాశ్రయంలోని కస్టమ్స్ విభాగంలోని లోపాల వల్ల.. సరకుల్ని బుక్ చేసుకునేందుకు వాణిజ్యవేత్తలు ఆసక్తి చూపడంలేదని అంటున్నారు.
ఇదీ చదవండి:
YSR Lifetime Achievement Awards : కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రంలోనూ పురస్కారాలు: జగన్