విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్టీసీ డిపో ఇకపై పూర్తిస్థాయి సేవలందించేందుకు సంసిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే ఈనెల 16వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో బస్సులన్నీ తిప్పి ఉద్యోగులందరికీ విధులు నిర్వహించే బాధ్యతలను అప్పగించేందుకు సన్నాహాలు చేస్తోంది.
నర్సీపట్నం ఆర్టీసీ డిపో పరిధిలో సుమారు 90 బస్సులు ఉండగా... ఇందులో సేవలందించేందుకు డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది కలిపి సుమారు 550 మందికిపైగా ఉన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఈ సిబ్బందిలో కేవలం సగం మందికి విధులను అప్పగించి మిగతా వారిని డిపోకి రప్పించి జీతాలు చెల్లిస్తున్నారు.
ఈ నెల 16వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఉద్యోగులు విధులను అప్పగించడం తోపాటు బస్సులన్నింటినీ తిప్పాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చూడండి
పీజీ వైద్యవిద్య విద్యార్థులకు శుభవార్త.. కటాఫ్ మార్కులు రెండింతలు తగ్గింపు