విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. తుని నుంచి దువ్వాడ వైపు అతి వేగంతో వస్తున్న కారు తాళ్లపాలెం వద్దకు రాగానే డివైడర్ని ఢీకొట్టి రోడ్డు అవతలి వైపుకి వెళ్లింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులను కారు ఢీకొంది. ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ స్వరూప్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతన్ని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా మల్లవరం ప్రాంతానికి చెందిన దంపతులు కె. రమణ, లక్ష్మిగా గుర్తించారు. వారు.. ఇద్దరు పిల్లలతో కలిసి దువ్వాడ లోని రాజీవ్ నగర్లో నివాసం ఉండేవారు.
ఓ వ్యక్తి నిర్లక్ష్యం... తీసింది దంపతుల ప్రాణం - dead
తాళ్లపాలెం జాతీయ రహదారిపై హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం... దంపతుల ప్రాణం తీసింది. ఇద్దరు పిల్లలకు అమ్మానాన్నలను దూరం చేసింది.
విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం జాతీయ రహదారి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి చెందారు. తుని నుంచి దువ్వాడ వైపు అతి వేగంతో వస్తున్న కారు తాళ్లపాలెం వద్దకు రాగానే డివైడర్ని ఢీకొట్టి రోడ్డు అవతలి వైపుకి వెళ్లింది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న దంపతులను కారు ఢీకొంది. ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ స్వరూప్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన ఓ ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతన్ని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కి తరలించారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా మల్లవరం ప్రాంతానికి చెందిన దంపతులు కె. రమణ, లక్ష్మిగా గుర్తించారు. వారు.. ఇద్దరు పిల్లలతో కలిసి దువ్వాడ లోని రాజీవ్ నగర్లో నివాసం ఉండేవారు.
~~~~~~~~~~~~~~~*
దుర్గం లో వరుస చోరీలు
~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో లో బుధవారం తెల్లవారు న వరుస చోరీలు జరగడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని పాత ఆంధ్ర బ్యాంకు సమీపంలోనూ మరో మూడు వీధుల్లో కణాలకు వేసిన తాళాలను పగులగొట్టి షట్టర్లు తీసి నగదు తీసుకెళ్తున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఇ నిందితుల కోసం గాలింపు చేపడుతున్నామన్నారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా