ETV Bharat / state

కోట్లకు పడగలెత్తిన ఏఈ... - కొమ్మాదిలో ఏసీబీ దాడులు న్యూస్

రికార్డుల పరంగా 3.88 కోట్ల ఆస్తి... మార్కెట్ విలువ దీని పది రెట్లు... ఇదంతా సాధరణ విద్యుత్ ఏఈగా పని చేస్తున్న అధికారి అక్రమంగా కూడబెట్టిన అక్రమాస్తులు! అవినీతి పాల్పడినందకు పదేళ్లు ఉద్యోగానికి దూరంగా ఉన్నారు... మళ్లీ ఉద్యోగంలోకి చేరగానే ఆశ్చర్యంగా పదోన్నతలు పొందారు.. దశాబ్దం విధులకు దూరమైనా... బుద్ధిలో మార్పు రాలేదు. మళ్లీ అవినీతికి పాల్పడి అనిశాకు చిక్కారు.

acb rides on ae house
అవినీతి ఏఈ
author img

By

Published : Jan 29, 2021, 1:45 PM IST

ఒక సెక్షన్‌లో పనిచేసే ఏఈకి రూ.30కోట్లకు పైగా విలువచేసే ఆస్తులుండటం ఆశ్చర్యంకాక మరేంటి? గురవారం ఒక్కరోజే విశాఖలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఏసీబీ దాడుల్లో రికార్డుల ప్రకారమే రూ.3.88కోట్లకుపైగా ఆస్తులున్నట్లు వెలుగుచూసింది. ఇది ఇప్పటి మార్కెట్‌ ప్రకారం 10రెట్లు ఉండొచ్చని అధికారిక వర్గాల్లో వెల్లడవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో అరెస్టయిన విశాఖకు చెందిన మాడెం నాగేశ్వరరావు పరిచయమిది.

సర్వీసు రికార్డు ఇదీ..

* 1991లో లైన్‌మెన్‌గా చేరిక

* 1992లోనే సబ్‌ఇంజినీర్‌గా పదోన్నతి

* 1994లో డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వైనం

* ఏసీబీకి చిక్కిన సుమారు పదేళ్లకు ఉద్యోగం నుంచి డిస్మిస్‌ (28.11.2003)

* తిరిగి 2013 ఆగస్టు 12న సబ్‌ ఇంజినీర్‌గా పునర్నియామకం

* అలా వచ్చిన 10వ నెలలోనే.. ఏఈగా పదోన్నతి

* ప్రస్తుతం కొమ్మాదిలో ఏఈగా పనిచేస్తూ ఏసీబీ చేతిలో అరెస్టు

గుర్తించిన ఆస్తులు

(తొలిరోజు అధికారులకు స్పష్టత వచ్చిన ప్రకారం..)

* సీతంపేట, సీతమ్మధార ఆక్సిన్‌టవర్స్, ఎంవీపీకాలనీల్లో ఖరీదైన ఫ్లాట్లు

* మధురవాడలో సొంతిల్లు, మరోచోట ఇంకో ఇల్లు

* రెండు లాకర్లలో 250గ్రా బంగారం, మరో లాకర్‌ గుర్తింపు

* రూ.1.50కోట్ల విలువచేసే ఫిక్స్‌డ్‌డిపాజిట్లు

* బ్యాంకు ఖాతాల్లో రూ.14లక్షలు

* భార్య, కుమారుని పేరుమీదా పలు ఆస్తులు

* రెండు కార్లున్నట్లు గుర్తింపు

* గురువారం రాత్రిదాకా రికార్డుల్లో రూ.3.88కోట్ల అక్రమాస్తులు, ప్రస్తుత మార్కెట్‌లో 10రెట్ల విలువ

* హైదరాబాద్‌లోనూ మరికొన్ని ఆస్తులున్నట్లు గుర్తింపు, అక్కడ కూడా ఓ లాకర్, బ్యాంకు ఖాతా

ఈపీడీసీఎల్‌ కొమ్మాది సబ్‌స్టేషన్‌లో ఏఈగా పనిచేస్తున్న మాడెం నాగేశ్వరరావు అవినీతి, అక్రమాలు ఏసీబీ దాడుల్లో గుప్పుమన్నాయి. గురువారం ఏకకాలంలో నగరం, చుట్టుపక్కల 12చోట్ల దాడులు జరిపారు. కార్యాలయం, ఇళ్లు, కుటుంబీకులు, బంధువుల ఇళ్లనీ సోదాచేశారు. శుక్రవారం వీటిని కొనసాగించడంతో పాటు హైదరాబాద్‌కూ ప్రత్యేక బృందాల్ని పంపుతున్నట్లు ఏసీబీ అధికారులు ప్రకటించారు.

మళ్లీ వచ్చాకే..

ఏసీబీ అధికారులిచ్చిన సమాచారం ప్రకారం.. 1994లో విశాఖలోనే సబ్‌ఇంజినీర్‌ హోదాలో లంచం తీసుకున్న కేసులో 2003 నవంబరు 28న నాగేశ్వరరావు నేరానికి పాల్పడినట్లు రుజువైంది. ఆ రోజునుంచి అతన్ని ఉద్యోగం నుంచి డిస్మస్‌ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వూ వెలువడింది. ఆ తర్వాత పదేళ్లకు.. 2013 ఆగస్టు 12న తిరిగి ఉద్యోగం పొందగలిగారాయన. అప్పటినుంచి డిస్కంలో బాగా చక్రం తిప్పినట్లుగా స్పష్టత ఇస్తున్నారు. చేరిన 10నెలల్లోనే పదోన్నతి పొందేలా ప్రభావితం చేయడంతో పాటు ఆస్తులు కూడా బాగా పెంచుకున్నట్లు తేలింది. మొదట్లో తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో పోస్టింగ్‌ ఇవ్వగా.. అతితక్కువ సమయంలోనే తన పలుకుబడితో మళ్లీ విశాఖకు వచ్చారని, ఇక్కడ కూడా కోరుకున్నచోట్ల పోస్టింగ్‌లు వేయించుకున్నారంటున్నారు. 2015 నుంచి నాలుగేశ్లపాటు మధురవాడ సబ్‌స్టేషన్‌లో విధుల్లో ఉన్న నాగేశ్వరరావుకు బదిలీ వచ్చింది. బదిలీపై వెళ్లిన ఆరునెలలకే మళ్లీ కొమ్మాదిగా ఏఈగా బదిలీ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. పేరుకు కొమ్మాది ఏఈ అయినా.. కూర్చోవడం మాత్రం మధురవాడ కార్యాలయంలోనే అన్నట్లు వ్యవహారశైలి ఉండేదని అంటున్నారు. అతని వ్యవహారంలో డిస్కం అధికారుల ప్రమేయం ఉందని చెబుతున్నారు.

పనితీరుపైనా ఫిర్యాదులు..

విద్యుత్తు వినియోగదారులనుంచి పెద్దఎత్తున డబ్బులు తీసుకునేవారనే ఆరోపణలు ఈపీడీసీఎల్‌లో చక్కర్లు కొడుతున్నాయి. నాగేశ్వరరావు మాటతీరులో, పనితీరులో పలు ఆరోపణలపై చాలామంది అతని ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల దృష్టికి తెచ్చేవారని చెబుతున్నారు. ప్రత్యేకించి బహుళ అంతస్థుల భవన సముదాయాలు, పరిశ్రమలు, వ్యాపార సముదాయాలకు విద్యుత్తు సేవలు, మీటర్లకు పేరు మార్పిడి సేవలు తదితరాలో అక్రమాలకు పాల్పడేవారనే ఆరోపణలున్నాయి. ఆరు నెలల క్రితం బక్కన్నపాలెం సమీపంలోని ఓ బహుళ అంతస్థుల భవన సముదాయానికి ట్రాన్స్‌ఫార్మర్, ప్యానల్‌బోర్డు ఏర్పాటు విషయంలోనూ లంచం తీసుకున్నట్లు బాధితులు ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారనీ చెబుతున్నారు.

ఇదీ చదవండి: విశాఖలో.. విద్యుత్ ఏఈ ఇంట్లో అనిశా సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.