విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. రాజవరం గ్రామంలో వీఆర్వోగా పనిచేస్తున్న రామకృష్ణ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. వంకా రమణ అనే రైతు తన భూమికి సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా... వీఆర్వో రూ. 20వేల లంచం డిమాండ్ చేశాడు.
ఈ మేరకు బాధితుడు విశాఖపట్నం అనిశా అధికారులను ఆశ్రయించాడు. తుని గొల్లప్పారావు కూడలిలో లంచం తీసుకుంటున్న రామకృష్ణను ఆధారాలతో సహా పట్టుకొని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 264 కరోనా పాజిటివ్ కేసులు..ఇద్దరు మృతి