ETV Bharat / state

SUCIDE: కొవిడ్‌తో ప్రేయసి.. ఉరేసుకొని ప్రియుడు..! - విశాఖపట్నం ముఖ్యవార్తలు

ప్రియురాలు కరోనాతో చనిపోయిందనే విషయాన్ని తట్టుకోలేకపోయిన ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విశాఖలోని గాజువాక కణితి రోడ్డులో చోటుచేసుకుంది. తన ప్రియురాలు గుంటూరులో కొవిడ్‌తో చనిపోయిందని తెలిసి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

suicide
suicide
author img

By

Published : Jul 21, 2021, 11:48 PM IST

Updated : Jul 22, 2021, 7:08 AM IST

తాను ఎంతో ఇష్టపడిన అమ్మాయి కొవిడ్‌ బారిన పడి మూడు రోజుల క్రితం గుంటూరులో మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక గాజువాకకు చెందిన యువకుడొకరు బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. గాజువాక ఎస్‌ఐ సూర్యప్రకాశ్‌ తెలిపిన వివరాల మేరకు... పరవాడ మండలం దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి కృష్ణారావు, శాంతి దంపతుల కుమారుడు రోహిత్‌కుమార్‌(25) ఇంటర్‌ వరకు చదివి గాజువాకలోని ఓ హోటల్‌లో ఆన్‌లైన్‌ పార్శిల్‌ సర్వీసు పని చేస్తున్నాడు. ఆరుగురు మిత్రులతో కలిసి కణితిరోడ్డులో నివాసం ఉంటున్నాడు. మధ్యాహ్నం వరకూ సహచర మిత్రులతో పార్శిల్‌ సర్వీసు కొనసాగించాడు.

మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక్కడే నివాస గదికి చేరుకుని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వచ్చిన మిత్రులు రోహిత్‌ మృతదేహాన్ని చూసి... వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనకాపల్లికి చెందిన యువతి గుంటూరులో కొవిడ్‌తో చనిపోయిందని బాధ పడేవాడని, మరో సంబంధం చూసి వివాహం చేస్తామని నచ్చజెప్పామని తండ్రి కృష్ణారావు కన్నీటిపర్యంతమయ్యారు. ఇంతలోనే ప్రాణాలు తీసుకుంటాడని అనుకోలేదని వాపోయారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

AP RAINS: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Last Updated : Jul 22, 2021, 7:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.