ETV Bharat / state

కన్నకూతురు కేసు పెట్టిందని తండ్రి బలవన్మరణం - విశాఖ తాజా వార్తలు

వాళ్లిద్దరూ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువకుడు అమ్మాయి తండ్రితో గొడవపడ్డాడు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి ఆగ్రహానికి గురై తండ్రిపై ఫిర్యాదు చేసింది. నాన్న మనస్సు ముక్కలయ్యింది. మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనాలోచిత నిర్ణయం నిండు ప్రాణాన్ని ఎలా బలితీసుకుందో తెలిపే ఈ ఘటన విశాఖ జిల్లాలో జరిగింది.

a person suicide at devarapalli visakha dist
కన్నకూతురు కేసు పెట్టిందని తండ్రి బలవన్మరణం
author img

By

Published : Oct 19, 2020, 4:49 AM IST

తనపై కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని దుబా వెంకటరమణ(55) బలవన్మరణానికి పాల్పడ్డాడు. విశాఖ జిల్లాలోని దేవరాపల్లి మండలం ఏ.కొత్తపల్లికి చెందిన వెంకటరమణ కుమార్తె, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 13న యువకుడు, అతని తల్లితో పాటు వెంకటరమణ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ప్రియుడిపట్ల తండ్రి వైఖరిపై యువతి ఆగ్రహానికి గురయ్యింది. మరుసటి రోజు ఆమె, తండ్రిపై కేసు పెట్టింది. కన్న కూతురు చేసిన పనికి ఆయన మనస్తాపానికి గురయ్యాడు. ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పాము కాటుతో క్వారీ కార్మికుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.