విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెద రామభద్రపురం గ్రామంలో ఓ యువకునికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. కాకినాడలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అతనికి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా కొవిడ్ సోకినట్లు తెలిసింది. దీంతో గ్రామంలోని వైద్య, పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోని పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు.
ఇదీ చదవండి : తంబళ్లపల్లె వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు