వావివరుసలు మరిచి మనవరాలిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడంటూ విశాఖ మన్యం హుకుంపేట మండలం మారుమూల గొంది వలసలో బాధిత కుటుంబీకులు ఆరోపించారు. చిన్నారికి తిను బండారాలు కొనిపెడతానని తీసుకువెళ్ళి తిరిగి వస్తూ మార్గమధ్యలో పెదగరువు పొలాల్లో అత్యాచారం చేశాడని కుటుంబీకులు తెలిపారు. గ్రామస్థుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిన్నారిని హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. నిందితుడు కొండబాబును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి: