విశాఖ జిల్లా ఆనందపురం మండలం బోయిపాలెం జాతీయ రహదారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గ్యాస్ లారీని ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నడుతున్న ఉండవల్లి జయరాం (32) మృతి చెందాడు. విశాఖ నుంచి తగరపువలస వెళ్తుండగా ముందు వెళ్తుతున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టింది.
ఘటనా స్ధలంలోనే జయరాం మృతి చెందాడు. మృతుడు స్థానిక దివీస్ లేబొరేటరీస్ లో పనిచేస్తున్నాడు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడు జయరాంకు గత ఫిబ్రవరి నెలలో వివాహం జరిగింది. ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: