ETV Bharat / state

నకిలీ బిల్లులతో 13 కోట్ల రూపాయలు కొట్టేశాడు..! - ఆంధ్రప్రదేశ్ తాజా నేర వార్తలు

నకిలీ బిల్లులు స్పష్టించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న వ్యవహారాన్ని విశాఖ జోనల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఛేదించింది. నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు స్పష్టించి 13 కోట్ల రూపాయల ఇన్​పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన వ్యక్తిని ఆరెస్టు చేశారు.

GST fraud
GST fraud
author img

By

Published : Dec 10, 2020, 10:01 PM IST

నకిలీ ఇన్వాయిస్‌లతో ఇన్​పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందిన వ్యవహారాన్ని విశాఖ జోనల్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఛేదించింది. ఈ కేసులో సూత్రధారిగా ఉన్న కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన 38 ఏళ్ల వ్యక్తిని ఆరెస్టు చేసింది. నిందితులు ఏపీ, తెలంగాణలలో మొత్తం 84 కోట్ల రూపాయిల మేర మూడు నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లు స్పష్టించి 13 కోట్ల రూపాయల ఇన్​పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు అధికారులు గుర్తించారు. గుంటూరు పరిసరాలల్లోనే ఈ నకిలీ సంస్థల చిరునామాలు ఉన్నట్టు విచారణలో తేలిందని జీఎస్టీ ఇంటలిజెన్స్ విభాగం సంయుక్త సంచాలకుడు మయాంక్ శర్మ తెలిపారు.

దొంగ బిల్లులు సృష్టిస్తున్న గుంటూరుకు చెందిన ఛార్టెర్డ్ అకౌంటెంట్​ను ఇటీవల అధికారులు అరెస్టు చేశారు. ఇతను వ్యాపారులకు 30 కోట్ల రూపాయల మేర దొంగ బిల్లులు సృష్టించినట్లు గుర్తించారు. వీటి వ‌ల్ల ఏడున్నర‌ కోట్ల రూపాయిల మేర‌కు ప్రభుత్వానికి నష్టం కలిగించిన‌ట్టు గుర్తించారు. ఆంధ్ర, తెలంగాణలో జీఎస్టీ రిజిస్ట్రేష‌న్ ఉన్న 14 ఇన్​ఫ్రా సంస్థల పేరిట దొంగ బిల్లులు సృష్టించిన‌ట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే గుంటూరు చుట్టు ప‌క్కల ఉన్న కార్యాల‌యాల్లో అధికారులు విస్తృత త‌నిఖీలు నిర్వహించగా... తాజా కేసు బయటపడింది.

ఇదీ చదవండి

పాతబస్తీలో దారుణం.. దుబాయ్​ షేక్​లకు మహిళల విక్రయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.