విశాఖ జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడు అగ్రహారం గ్రామంలో ఓ వ్యక్తి పై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కొల్లి అప్పలరాజు అనే వ్యక్తి తన భార్యతో... కొల్లి శ్రీనుకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కక్ష పెంచుకున్నాడు.
పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న శ్రీనుపై అప్పలరాజు కత్తితో దాడి చేశాడు. బాధితునికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: