విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బట్ట పనుల పంచాయతీ శివారు కాట్రగడ్డ గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో దేశగిరి లక్ష్మణ్ రావు అనే గిరిజనుడు తాటాకు ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో విలువైన సామాగ్రితో పాటు... బంగారం, డబ్బు కూడా కాలిబూడిదైపోయాయి. పూర్తిగా నిరాశ్రయులైన తమను ప్రభుత్వం ఆదుకుని సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ మేరకు రెవెన్యూ సిబ్బంది ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండీ...పిఠాపురంలో అగ్నిప్రమాదం.. ఆహుతైన 1200 కోళ్లు