విశాఖ జిల్లాలో పదవీ విరమణ పొందిన ఐదుగురు పోలీసులకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమాన్ని కైలాసగిరి పోలీసు మైదానంలో ఉన్నతాధికారులు నిర్వహించారు. పదవీ విరమణ పొందిన అధికారులను జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సన్మానించారు. జ్ఞాపికలను అందజేశారు.
కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి నిబద్ధతతో విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. పోలీసు శాఖ తరపున ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఇక కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని కోరారు. పదవీ విరమణ తర్వాత కూడా పోలీసు కుటుంబంలో సభ్యులేనని, ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా సంప్రదించాలని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:
ఎఎన్యూ యూనివర్సిటీ ఎఫ్ఎసీ వీసీ పై విచారణ కమిటీకి ప్రభుత్వం ఆదేశం