పంచాయతీ ఎన్నికల లెక్కింపు విషయంలో అవకతవకలు జరిగాయని.. విశాఖలోని ఆనందపురం మండలం గండిగుండం వాసులు ఆందోళన చేపట్టారు. విశాఖ కలెక్టరేట్ ఎదుట.. గండిగుండం సర్పంచ్ అభ్యర్థి రమేష్ తరుపు 700 మంది మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఎన్నికలు లెక్కింపు సజావుగా జరగలేదని ఆరోపించారు. రీపోలింగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఓట్ల లెక్కింపు వ్యవహారంలో 21 ఓట్లకు అవకతవకలు జరిగాయని.. బాధిత అభ్యర్థి రమేష్ ఆరోపణలు చేశారు. కలెక్టర్ వచ్చి తమకు న్యాయం చేసేవరకు అక్కడి నుంచి కదిలేదని లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుక్షణం ఉత్కంఠ