ఇరవై రెండు రోజులుగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సందర్భంగా సోమందేపల్లిలోని గ్రామ ప్రజలు ఎవరూ బయటకు రావటం లేదు. గ్రామంలోని కోతులకు ఎటువంటి ఆహారం అందక తల్లడిల్లిపోతున్నాయి. వాటి బాధను చూసిన సోమందేపల్లి స్టేషన్ ఎస్సై ,సిబ్బంది పదిహేను వందల అరటిపళ్లను తెచ్చి మూగజీవాలకు అందించారు. ఆహారం లభించక ఒక కోతిని మిగతా కోతులు పీక్కు తినడం చూసి మనసు చలించిపోయింది అని ఎస్సై వెంకటరమణ అన్నారు. అందుకే మూగజీవాలను కోతులకు ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. గ్రామంలోని ప్రజలు కూడా ఎక్కడైనా మూగజీవాల కనపడితే వాటికి ఆహారం అందించి వాటి మనుగడకు కృషి చేయాలని ఎస్సై కోరారు.
ఇదీ చూడండి: